calender_icon.png 4 July, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

03-07-2025 12:03:56 AM

ఫుడ్ ఫెస్టివల్‌లో సతిసమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

భూత్పూర్ , జూలై 2 : ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నా రు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం మున్సిపాలిటీ పట్టణంలోని కెవిఎన్ ఫంక్షన్ హాల్ లో వందరోజుల ప్రణాళికలో భాగంగా మహిళ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ లో సతీసమేతంగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా ష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారిని లక్షాధికారులను చేయడమే ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రస్తుతం 65 లక్షల మంది ఉన్న డ్వాక్ర మహిళా సభ్యులను కోటి వరకు పెంచాలని ప్ర భుత్వ లక్ష్యమన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో గత పది సంవత్సరాలుగా ముందుకు సాగని రేషన్ కార్డులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మ హిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వివినిగం చేసుకొని వ్యాపార రంగంలో రాణించాలన్నారు. అనంతరం మదిగట్ల స్టేజి నుండి మదిగట్ల గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో సతీసమేతంగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం వారిని గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నూరల్ నజీబ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ డాక్టర్ కదిరే శేఖర్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్. భూపతి రెడ్డి, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మ, ప్రధాన కార్యదర్శి లిక్కీ విజయ్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, హర్యానాయక్, రవి, బోరింగ్ నర్సింలు, మచ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.