03-07-2025 12:02:30 AM
- భూమి కోసం ఒకరు.. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు బానిసై మరొకరు
- గొడ్డలితో నరికి, కత్తితో గొంతులో పొడిచి హత్యలు
- సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు
మోతె/శేరిలింగంపల్లి, జూలై 2: కొడుకుల చేతిలో తండ్రులు హతమయ్యారు. భూ పం పకం చేయలేదని ఓ కొడుకు తండ్రిని గొడ్డలితో నరికి చంపగా.. మరో ఘటనలో తండ్రి కి తెలియకుండా రూ.రెండున్నర లక్షలు ఆన్‌లైన్ గేమ్స్‌లో పోగొట్టుకుని, పదేపదే డబ్బు ఏమయిందని తండ్రి అడుగుతుండటంతో కత్తితో గొంతులో పొడిచి చంపాడు మరో కొడుకు. ఈ రెండు ఘటనలు సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల్లో జరిగాయి.
సూర్యాపేట జిల్లాలోని మోతే మండలం విభళాపురం గ్రామపంచాయతీ పరిధిలోని నాగయ్యగూ డెం గ్రామానికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న(55)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వెంకన్న పేరుపై నాలుగు ఎకరాల భూమి ఉన్నది. ఎకరం భూమిని కుమార్తెకు పట్టా చేయగా మిగిలిన మూడు ఎకరాల భూమి వెంకన్న పేరునే ఉన్నది. తమ పేర్లపై పట్టా చేయాలని ఇద్దరు కుమారులు కుమారులు కోరగా తాము బతికినంత కాలం ఇలా నే ఉండాలని వెంకన్న చెప్పాడు. దీంతో పలుసార్లు గొడవలు జరగగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఫలితం లేకపోవడంతో పెద్ద కుమారుడు గంగయ్య తండ్రిపై కక్ష పెంచుకున్నాడు.
బుధవారం వెంకన్న పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై సూర్యాపేటకు వెళ్లి వస్తున్నక్రమంలో మామిళ్లగూడెం దాటిన తర్వాత విభళాపురం ఐకెపీ కేంద్రం ఏర్పాటు చేసిన స్థలం వద్దకు రాగానే అప్పటికే అక్కడ వేచి చూస్తున్న గంగయ్య తండ్రి బైక్‌ను ఆపి గొడవపడ్డాడు. ఈ క్రమం లో కోపోద్రిక్తుడైన గంగయ్య తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో తండ్రి తలపై దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంకన్న వద్దకు వచ్చేసరికి గంగయ్య పరారయ్యాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే మృతిచెందాడు. మృతుడి కుమార్తె స్వరూప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడు వెంకన్న భార్య గత ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది.
ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు బానిసై..
ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు అలవాటు పడిన కొడుకు.. అందులో డబ్బులు పోగొట్టుకుని కన్నతండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. వనపర్తికి చెందిన హనుమంత్ నాయక్(38) తన కుటుంబంతో కలిసి గచ్చిబౌలిలో నివాసముంటున్నాడు. తన కొడుకు రవీందర్‌నాయక్(18) ఇంటర్ పూర్తి చేశాడు.
ఇటీవలే వనపర్తిలోని తన స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ.6 లక్షలను హనుమంత్ నాయక్ గచ్చిబౌలిలోని ఇంటికి తీసుకొచ్చాడు. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు బానిసైన ఆయన కుమారుడు రవీందర్‌నాయక్.. ఇంట్లో ఉంచిన ఆ డబ్బు నుంచి రూ.రెండున్నర లక్షలు తీసుకెళ్లి పోగొట్టాడు. కొద్దిరోజులుగా తండ్రి డబ్బు గురించి అడుగుతుండగా రవీందర్ తన స్నేహితుడికి అవసరం ఉంటే ఇచ్చానని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో మంగళవారం మధ్యా హ్నం 12 గంటల సమయంలో తన స్నేహితుడు డబ్బులు తిరిగి ఇస్తున్నాడని తండ్రి హనుమంత్ నాయక్‌ణు నమ్మించి నిర్మాను ష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ తండ్రిని కత్తితో గొంతులో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం రవీందర్ తన బావ రమేష్ నాయక్‌కు ఫోన్ చేసి తండ్రి చనిపోయినట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు అనుమానం రావడం తో రమేష్ నాయక్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసు కున్న పోలీసులు నిందితుడు రవీందర్‌నాయక్‌ను అరెస్టు చేశారు.