25-07-2025 02:29:38 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల, జులై 24: రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం కర్తాల్ మండలంలోని మైసిగండి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాలలో ఇటీవల ఆరు లక్షలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ఎమ్మెల్యే ప్రారంభించి విద్యార్థులకు పాఠశాల సామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో ముచ్చటించారు.
నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో అన్ని వసతి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆయన కోరారు. అనంతరం పాఠశాల ఆవరణలో రూ. 2.70 కోట్లతో నిర్మిస్తున్న నూతన అదనపు తరగతి గదులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అదనపు గదులను నాణ్యతగా నిర్మించడంతోపాటు తురతి గతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఏఎంసి చైర్ పర్సన్ గీతా, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాపయ్య, హాస్టల్ అధికారి బాలరాజు, పీసీసీ సభ్యుడు ఐల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచులు నరసింహ శేఖర్ గౌడ్, బిచా నాయక్ తదితరులు పాల్గొన్నారు.