calender_icon.png 30 July, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న సర్కారు

29-07-2025 12:29:50 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, జులై 28: ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీలో రూ. 3 .50 కోట్లతో నిర్మించనున్న అదనపు తరగతి గదులు , ల్యాబ్ భవనాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఆనంతరం వన మహోత్సవంలో భాగంగా షాబాద్ పీహెచ్ సీ వద్ద మొక్కలు నాటి నీరు పోశారు.

తర్వాత పీహెచ్ సీ సెంటర్ ను సందర్శించి.. సమయపాలన పాటించిన డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు ఎప్పుడు సెంటర్ లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అ నంతరం షాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అలాగే 10 మందికి రూ.4.3 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీలు వెంకటరెడ్డి, కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, ఖాజా మియా, నరేందర్ రెడ్డి, మహేందర్ గౌడ్, రవీందర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, లింగం, జంగయ్య, నాయకులు కృష్ణారెడ్డి రెడ్డి, రాహుల్, మాధవరెడ్డి, రాజేందర్ రెడ్డి, అన్వర్, ప్రభాకర్ రెడ్డి, కిషోర్, శేఖర్, రఫిక్,మాణిక్యం, శ్రీనివాస్‌పాల్గొన్నారు.