25 August, 2026 | 1:41 AM

22ఏ పై ప్రభుత్వమే చిత్తశుద్ధితో ఉంది

25-08-2026 12:00 AM

ముకరంపుర, ఆగస్టు 24(విజయ క్రాంతి): 22ఎ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలియజేశారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి 22ఎ సమస్య దృష్టికి వచ్చిన వెంటనే రెవెన్యూ మంత్రితో అధికారులతో సమీక్ష నిర్వహించి వెంటనే పరిష్కరించాలని ఉద్దేశంతో ప్రభుత్వమే కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగా కలెక్టర్లు రెవెన్యూ అధికారులు అదే పనిమీద ఉన్నారని దీంట్లో ప్రతిపక్ష పార్టీలు లబ్ది పొందాలని చూడడం ధర్నాలు చేయ డం విడ్డూరంగా ఉందని నరేందర్ రెడ్డి వా పోయారు.

భూదందా లకు కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్ పార్టీ అని పది సంవత్సరాలు ధరణి పేరుతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసి భూదందాలకు పాల్పడి భూకబ్జాలలో వాళ్ల నాయకులు జైలుకు వెళ్లి ఇప్పు డు మొసలి కన్నీరు కారుస్తూ డ్రామాలు ఆడుతున్నారని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కుర్ర పోచయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.