26-05-2025 12:49:14 AM
బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వనం రాములు యాదవ్
పెబ్బేరు, మే 25: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో రైతుల తడిసిన ధాన్యాన్ని బ రాసా నాయకులు ఆదివారం సందర్శించారు.
అకాల వర్షాల కారణంగా రైతుల ధాన్యం తడి సిపోయిందని,ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యక్షుడు వనం రాములు విమర్శించారు.రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను నమ్ముకుని వర్షం లో నానబెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడిందని అన్నారు.
కనీసం ధాన్యాన్ని వర్షం నుంచి రక్షించుకోవటానికి టార్ఫాలిన్ లు కూడా లేకపోవటం విచారకరం అని అన్నారు. తడిసిన ధాన్యాన్ని బేషరతుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో బరాస నాయకులు పెద్దింటి వెంకటేష్, ఎద్దుల సాయినాథ్, వడ్డె రమేష్,వేణుగోపాల్, మోహన్, రామకృష్ణ, ఈశ్వర్, మధు, హర్షవర్దన్ రెడ్డి, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.