calender_icon.png 26 May, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నందనం తాటి నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి

26-05-2025 12:50:00 AM

మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్

యాదాద్రి భువనగిరి, మే 25 (విజయక్రాంతి): భువనగిరి మండలం నందనం గ్రామంలో తాటి నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, డిమాండ్ చేశారు.  ఆదివారం నాడు మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి నందనం గ్రామ తాటి, నీరా ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన తాటి నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసివేశారని అన్నారు.  స్థానిక గౌడ కులస్తులకు ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాలు కల్పించి  ఉత్పత్తుల కేంద్రానికి బొమ్మగాని ధర్మం భిక్షం గౌడ్ పేరు పెట్టాలి. జూన్ 2 వరకు ఈ కేంద్రాన్ని ప్రారంభించాలని  లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కల్లుగీత కార్మిక పారిశ్రామిక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, ఏవి కిరణ్ , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, పడమటి మమత తుమ్మల వెంకట్ రెడ్డి, కడమంచి ప్రభాకర్, జక్కా రాఘవేందర్ రెడ్డి, పలుసం రమేష్ గౌడ్, మట్ట ధనుంజయ గౌడ్, ర్యాకల శ్రీనివాస్,

రాంపల్లి నాగేష్ గౌడ్, పడాల వెంకటేశ్వర్లు, బత్తిని కుమార్ గౌడ్, బబ్బూరి పెద్ద నరసింహ గౌడ్, కూనూరు అంజయ్య గౌడ్, కాసుల రామనర్సయ్య గౌడ్, భువనగిరి లాలయ్య గౌడ్, అజీమ్, ఎలిమినేటి విట్టల్ రెడ్డి, చింతల దేవేందర్ గౌడ్, పిన్నింటి మధుమోహన్ రెడ్డి, జనగాం మహేష్, సిలువేరు మధు, సుర్వి సంపత్ గౌడ్, నీల భరత్ గౌడ్, ములుగు నాగరాజు, మోడపు జీవన్ గౌడ్, మోత్కుపల్లి అజయ్  తదితరులు పాల్గొన్నారు.