26-05-2025 12:48:37 AM
యాదాద్రి భువనగిరి, మే 25 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోనీ కన్యకా పరమేశ్వరి కాలనీలో నూతనంగా నిర్మించిన యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు. అనంతరం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మార్త వెంకటేశం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైస్ మిల్లర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ మిల్లర్స్ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వెండింగ్ బకాయిలను ఇప్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రైతులు పండించిన పంటను కొనేందుకు ఈసారి కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసి రైతులకు మరియు రైస్ మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేజ్ చిస్తి,రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంపా నాగేందర్, వి.మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టి చంద్రపాల్ రాష్ట్ర కోశాధికారి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట మల్లారెడ్డి,జిల్లా కోశాధికారి గౌరిశెట్టి అశోక్, వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు రైస్ మిల్లర్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.