calender_icon.png 29 October, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

28-10-2025 06:57:19 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): ఆదివాసి సంఘాలు, అంబేద్కర్ సంఘాలు ఆధ్వర్యంలో శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని మంగళవారం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈనెల 18న దహెగాం మండలం గేర్రే గ్రామంలో జరిగిన కుల హత్యకు గురైనటువంటి 9 నెలల నిండు గర్భిణీ, శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వమే అన్నివిధాలుగా ఆదుకోవాలి శ్రావణి కుటుంబానికి వెంటనే 25 లక్షలు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలి, భవిషత్తులో కుల హత్యలు జారకుండా కులాంతర రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

శ్రావణి కుటుంబానికి మూడెకరాల భూమి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. భవిష్యత్తులో కుల హత్యలు జరగకుండా ప్రభుత్వం కులాంతర రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి.పాస్ట్రక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితునికి తక్షణమే శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆదివాసి కోయ సంక్షేమ సంఘం అధ్యక్షులు, సోయం చిన్నయ్య వైస్ ప్రెసిడెంట్,తలండి మధుకర్ ,అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు,కోట సతీష్ తురుపతి, సరళి,కొలవర్ సంఘం సహాయక కార్యదర్శి, వెంకటేష్,పెద్దల శంకర్,ఎడ్ల మహేష్,తిరుపతి, మల్లేష్ దిలీప్,కోయ సంగం మండల అధ్యక్షులు.కోరేద తిరుపతి,మహిళా సంఘం అధ్యక్షురాలు, అమృత,లలిత తదితరులు పాల్గొన్నారు.