28-10-2025 06:54:26 PM
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు మంథని ఎస్ఐ-2 సాగర్ తెలిపారు. మంథనికి చెందిన సిరిపురం వీర శంకర్ నారాయణ తల్లి సిరిపురం వీరలక్ష్మి(84) గత పది ఏండ్ల నుండి అనారోగ్యంతో బాధపడుతుందని, చికిత్స కోసం ఆమెను కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులలో చికిత్స చేయించిన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో నడవలేని స్థితిలో ఉండడం వల్ల జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో తలుపులు దర్వాజాలకు ఉపయోగించే రంగులను కడుగుటకు గాను ఇంట్లో తెచ్చి పెట్టిన పెట్రోల్ తో తన ఒంటిపై పోసుకొని ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణంపై కుటుంబ సభ్యులకు ఎవరిపై ఏలాంటి అనుమానం లేదని తన కుమారుడు వీర శంకర్ నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.