calender_icon.png 6 December, 2024 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

11-10-2024 12:33:57 AM

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే మురళీధర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10(విజయక్రాంతి): మూసీ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకుంటుందని డాక్టర్ సీ నారాయణ రెడ్డి అవార్డు, బోయ భీమన్న అవార్డు గ్రహీత, గోషామహల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కే మురళీధర్ రెడ్డి అన్నారు. నాంపల్లి స్టేషన్ రోడ్డులోని చిరాక్ గల్లీ లేన్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద గురువారం ఆయన పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాలనీ పెద్దలు ఆయనను శాలువా తో సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించి అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. భవిష్యత్ తరాల మంచి కోసమే సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణకు నడుం బిగించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కే అక్షిత్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.