28-10-2025 01:21:10 AM
మహబూబ్ నగర్, అక్టోబర్ 27(విజయక్రాంతి): అసలు ప్రజాపాలన ప్రభుత్వంకు ఏమైంది... రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు డబ్బులు లేవు అభివృద్ధి ఎలా చేయాలి అనే నినాదం ప్రజల్లోకి దూసుకుపోతుంది. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు ద్ రెడ్డి వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనగా మారినప్పటికీ ఒకటికి రెండు మార్లు టిపిసిసి నోటీసులు జారీ చేయడంతో పాటు పార్టీ పెద్దలు సైతం పలుమార్లు అవసరమైన సంభాషణ చేయాలంటూ హితబోధ చేసిన ట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అం టూ మొదటి నుంచి ప్రజల్లో నుంచి వస్తున్న మాట.
ఒక సందర్భంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని తట్టుకునేది చాలా కష్ట మైన పరిస్థితి అనే రోజులకు ముగింపు పలుకుతూ తన నిజాయితీ తనను గెలుపు తీరాల కు చేర్చుతుందంటూ ప్రచారం చేసుకొని గెలుపు తన ఖాతాలో వేసుకున్నారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంపై సర్వత్ర చర్చకు దారితీస్తుంది.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర చర్చ..
ప్రజా పాలన ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు తెచ్చిందని ప్రచారం జరుగుతుంది మా దగ్గ ర లక్ష, రెండు లక్షలు నిధులు కేటాయించేందుకు కూడా నిధులు లేవు. ఎమ్మెల్యేలుగా చె ప్పుకున్నందుకు మా పరిస్థితి దయనీయంగా మారిపోయింది. గ్రామాల్లో తిరిగితే ప్రజలు ఎవరు ఎప్పుడు ఏమి అడుగుతారు వారి సమస్యలను తీర్చేందుకు నిధులు లేకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
పెళ్లిళ్లకు పేరంటాలకు తిరుగుతూ కాలం గడి పే పరిస్థితి సంతరించుకుంది. నిధులు కేటాయించకపోతే ప్రజలకు ఎలాంటి సమాధా నం చెప్పే పరిస్థితి లేకుండా పోతుంది. ఎ మ్మెల్యే వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ నేతల్లో అలజడి
అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్ర భుత్వం పై విమర్శలు చేస్తుంటే కార్యకర్తల్లో అంతర్మదనంలో పడినట్లు తెలుస్తుంది. ప్ర జా పాలన ప్రభుత్వం ప్రజలకు మంచి చే స్తుంది అని అనుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత వ్యాఖ్యలు రావడం తో కార్యకర్తల్లో ఏమి చేయాలో తెలియని ప రిస్థితులు నెలకొంటున్నాయని కాంగ్రెస్ నే తలే కొందరు చెబుతున్న మాట.
ప్రజా పాల న ప్రభుత్వము మరో అడుగు ముందుకేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని అడుగు లు వేస్తేనే సొంత పార్టీ నేతల నుంచి మంచి మాటలు వస్తాయని ఆలోచన వైపు నాయకులు అడుగులు వేస్తుండ్రు. ఎల్లప్పుడూ ప్ర శాంతంగా కనిపించే పాలమూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలలో అర్థం పరమార్థం ఉం టుందని ప్రజలు అంటుండ్రు. ఈ అంశాల ను పరిగెను తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అవసరమైన అడుగులు ముందుకు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ నేతలు ద్వారా తెలుస్తుంది.