calender_icon.png 5 September, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు గౌరవప్రదమైన ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం

05-09-2025 12:55:40 AM

  1. కేంద్రం సహకరించక పోయినా సంక్షేమపథకాలు అమలుచేసి తీరుతాం

కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్దికి అన్నివిధాలా సహకరిస్తా

ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి):కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇం డ్ల పథకం పేద వర్గాల సామాజిక గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని, పేదల సొంతింటి క ల నెరవేరడంలో ఈ పథకం కీలకపాత్ర పోషిస్తుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రా మ్ సహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం శా సనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు లు అన్నారు.

కొత్తగూడెం నియోజక వర్గం పరిధిలోని సుజాతనగర్ మండలంలో సుజాతనగర్, సింగభూపాలెం, గరీబీపేట, లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు గురువారం సుజాతనగర్ రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో వారు మంజూరిపత్రాలు అందజే శారు.

ఈ సందర్బంగా జరిగిన సభలో మా ట్లాడుతూ నియోజకవర్గంలో ఇల్లు లేని పేద లు ఉండకూడదనే దృఢ సంకల్పంతో అక్రమాలకూ తావులేకుండా నిజమైన లబ్దిదా రులను ఎంపిక చేసి మొదటిదఫా ఇండ్లను మంజూరు చేయించడం జరిగిందన్నారు దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి గృహవ సతి కల్పిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి నిధుల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపా రు.

నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీల పరిధిలో 136మంది లబ్దిదారులకు ఇం దిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు అంద చే శారు. రూ.60లక్షల ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధుల ద్వారా చుంచుపల్లి మండలంలోని ధన్బాద్, అంబేద్కర్ నగర్, రాంపూర్లో నిర్మించిన జిపి కార్యాలయాలు, లక్ష్మీదేవిపల్లి మండలంలో ని అనిశెట్టిపల్లి, లక్ష్మీదేవిపల్లిలో రూ.24లక్షల వ్యయంతో నిర్మించిన జిపి కార్యాలయం మీ టింగ్ హాల్, అంగన్వాడీ కేంద్రాన్ని వారు ప్రారంభించారు.

విద్యానగర్, సారయ్య కాలనీల ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్క రించేందుకు రూ.70లక్షలతో వాటర్ ట్యాంక్, నూతన పైప్ లైన్ నిర్మాణం, పైపులై న్ల పొడగింపు పనులకు శంకుస్థాపన, విద్యానగర్లో రూ.5.22కోట్ల ఎల్డబ్ల్యూఈ నిధులతో నిర్మించిన భవనంలో నర్సింగ్ కళాశాలను ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి ప్రారంభించా రు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి, ప్ర జలకు కావాల్సిన కనీస మౌలిక వసతుల కల్పనకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఎంపీ పేరొన్నారు.

కార్యక్రమంలో సిపిఐ జి ల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులునాగ సీతారాములు, ఆళ్ల ముర ళి, సొసైటీ చైర్మన్ హన్మంతరావు, గ్రంధాలయ చైర్మన్ వీరబాబు, కూచిపూడి జగన్, రజాక్, పూనెం శ్రీనివాస్, చింతలపూడి రాజశేఖర్, చీకటి కార్తీక్, సిపిఐ జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య,

ఎస్ కె ఫహీమ్, కొమారి హన్మంతరావు, దీటి లక్ష్మీపతి, వట్టికొండ మల్లికార్జునరావు, జక్కుల రాములు, మునిగడప వెంకటేశ్వర్లు, తాళ్లూరి పాపారావు, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, పిఆర్ ఏఈ శివలాల్, నవీన్, రామకృష్ణ, విద్యుత్ శాఖా ఏఈ రఘురామయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటస్వామి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.