calender_icon.png 5 September, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో దండిగా ప్రసవాలు

05-09-2025 01:00:27 AM

  1. పేదలకు చేరువలో.. ప్రభుత్వ వైద్యం

ఆసుపత్రికి క్యూ కడుతున్న వందల మంది రోగులు..

మెరుగైన సేవలపై ప్రజల హర్షం

మణుగూరు, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : గతంలో జబ్బు చేస్తే నేనే రాను బి డ్డో సర్కారుదవాఖానకు అన్నారు. కానీ నేడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో అనుభవజ్ఞు లైన వైద్యులు, మెరుగైన వైద్య సేవలతో ప్ర భుత్వ దవాఖాన రూపురేఖలు మారడంతో ప్రజలుసర్కారు దవాఖాన బాట పట్టారు. మెరుగైన వసతులకు తోడు ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, ఆస్పత్రి లో పలురకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు.

దీంతో ప్రజలు జబ్బు చేస్తే ఆసుపత్రికి రోగు లు వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు. మరోవైపు 24 గంటలు అత్యవసర సేవలు, ఆరోగ్య పరీక్షలు, తల్లీ బిడ్డ సంరక్షణ,సాధారణ కాన్పులు,ప్రసవానంతరం వాహన స దు పాయం, గైన కాలజిస్ట్ వైద్యులు అందిస్తున్న సేవల తో ప్రభుత్వ దవాఖానలో ప్రస వాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 

ఆస్పత్రి చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా ఆగస్ట్ నెలలో వంద ప్రసవాలు జరిగాయి. 2023 సెప్టెంబర్ నెలలో 87 ప్రసవా లు జరగగా నాటి రికార్డు ను మించి, నేడు ప్రసవాలు విశేషం. మహిళా వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణతో ప్రతి వారం గర్భిణులకు ఆరో గ్య పరీక్షలు చేస్తున్నారు. ఆహ్లా దకరమైన వాతావరణంలో గర్భిణులకు పౌష్టికాహారం తో పాటు నాణ్యమైన వైద్యం అందించడంతో ప్రసవాలు పెరిగాయని, వీటిలో సాధారణ కాన్పులు కూడా పెరిగాయని వైద్యులు పే ర్కొన్నారు.

గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రసవాల సంఖ్యను పెంచడంలో ప్రత్యేక కృషిచేసిన మహిళా వైద్యులు పద్మా, అజంతా, అనస్థసీయా డాక్టర్. ప్రసాద్‌రావు , పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీదేవి, సుప్రియా, ప్రణవ్ లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య అధికారులు, ఆస్పత్రి ఆర్ ఎం ఓ డాక్టర్. మా ర్తిసాయి మోహన్ ప్రత్యేకంగా అభి నందించారు. కార్పొరేట్ కు ధీటుగా ప్ర భుత్వ దవాఖానల్లో వైద్యసౌకర్యాలు, మహిళలకు ప్రత్యేక వైద్య సేవలను కల్పిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెరుగైన వైద్యం అందిస్తున్నాం

ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల కు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. రోగులకు మందులు అంద జేస్తున్నం, అవస రమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తు న్నాం. గర్భిణులకు ప్రతి వారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి మందులుఇస్తున్నాం. ఉత్తమ సేవలు అందిస్తున్నాం.

 సునీల్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్