calender_icon.png 10 September, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడం సర్కార్ లక్ష్యం

10-09-2025 12:43:58 AM

ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూర్, సెప్టెంబరు 9 (విజయ క్రాంతి): ప్రభుత్వ వైద్యపరమైన ఇబ్బందుల్లో ఉన్న పేదలకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో తిమ్మాపూర్ మండలానికి చెందిన 62 మందికి 19.97 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులతోపాటు మరో 17 మందికి కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే సీఎంఆర్‌ఎఫ్ నుంచి సహాయాలు అందజేస్తున్నదని వివరించారు. వైద్యం కోసం ఖర్చు పెట్టిన మొత్తాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఇవ్వలేకున్నా కొంత మేర కు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తున్నదని ఆయన వివరించారు.

ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఆదరణ చూపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కా ర్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, శ్రీగిరి రంగారావు, కుంట రాజేందర్ రెడ్డి, గోపు మల్లారెడ్డి,

మామిడి అనిల్ కుమార్, అనభేరి రాధాకిషన్ రావు, చింతల లక్ష్మారెడ్డి, బుధారపు శ్రీనివాస్, కొత్త తిరుపతిరెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, మాచర్ల అంజయ్య, జి.సంపత్ రెడ్డి, గుంటి మల్లేశ్, పెంట వినోద్ కుమార్, కాసర్ల సంపత్, వీర చంద్రారెడ్డి, కంది అశోక్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.