10-09-2025 12:44:49 AM
-బీఆర్‌ఎస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి
-మిగిలిన 10 శాతం పూర్తి చేయడం చేతకాదా?
-22 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసింది?
-పాలమూరు బిడ్డ రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఎక్కడికి వెళ్లినా, ఏ సమావేశం ఏర్పా టు చేసిన తాను పాలమూరు బిడ్డను అని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి 22 నెలలు అవుతున్నా పాలమూరు ప్రాజెక్టు పనుల ను పూర్తి చేయకుండా ఎందుకు పడావు పెట్టా రో చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
మం గళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సతీమణి ప్రథమ వర్ధంథికి కేటీఆర్ హాజరై, నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రిగా అయితే పాలమూరుకు మేలు జరుగుతుందని నమ్మి ఉమ్మడి జిల్లాలో ని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ కోసం మీ మామగారు జైపాల్‌రెడ్డి చేసిన పోరాటాలు ఏమిటో, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆయనకున్న సంబంధం ఏమిటో ప్రజలకు తెలుసునన్నారు. ప్రాజెక్టుకు మాత్రం జైపాల్‌రెడ్డి పేరు పెట్టారని, పనులు మాత్రం చేపట్టడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజె క్టుకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయకుండా పడావు పెట్టారని దుయ్యబట్టారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తే ఆ పేరు కేసీఆర్‌కు వస్తుందని భావించి పనులు నిలిపివేశారన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ముందుకు సాగనివ్వకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు పనులను రూ.4000 కోట్లతో చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 85 పిల్లర్ల లో రెండు పిల్లర్లు కూలిపోతే, ఏజెన్సీకి చెప్పినా వాళ్లు మరమ్మత్తు చేస్తారని, అలా చేయకుండా లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ జాతీయ అం తర్జాతీయ స్థాయిలో హంగామా చేస్తూ కేసిఆర్‌పై కేసులు పెట్టాలని దురాలోచనతో సీఎం పైశాచికానందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు.
జెండర్ చెప్పుకోలేని పరిస్థితిలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు
పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు ఆడో.. మగో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ ఘాటుగా స్పందించా రు. వారు ఏ పార్టీయో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ‘అవును మేము 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకు న్నాం’ అని ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ చెప్పారని.. చర్యలు తీసుకోవడానికి స్పీకర్‌కు ఇంతక న్నా మరి ఇంకేం ఆధారం కావాలని ప్రశ్నించారు.
గద్వాల ఎమ్మెల్యే తాను పార్టీ మారలేదు అంటున్నాడు? మరి అసెంబ్లీ సమావేశాలలో కాం గ్రెస్ నాయకులు కేసీఆర్‌ను నానా మాట లు అంటుంటే ఎందుకు అడ్డుకోలేదో చెప్పాలని నిలదీశారు. పార్టీ కార్యక్రమాల కు ఎందుకు హాజరు కావడంలేదని కేటీఆర్ ప్రశ్నించారు. సృష్టిలో ఆడ.. మగతోపాటు మరో జెండర్ కూడా ఉంటుందని, మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ కోవకు చెందుతారో అర్థం చేసుకోవాలని చురకలంటిం చారు. సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.