30-07-2025 12:57:13 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్, జూలై 29 (విజయక్రాంతి): భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం-2020 విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు బాటలు వేస్తుందని వర్ధన్న పేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు అన్నారు. పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హసన్ పర్తిలో ప్రధానోపాధ్యాయురాలు ఎన్నంశెట్టి సుమాదేవి అధ్యక్షతన జరిగిన జాతీయ విద్యా విధానం- 2020 5వ వార్షికోత్సవ సమావేశంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను దత్తత తీసుకున్న ఈ పాఠశాల పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల హసన్ పర్తి జిల్లాలోనే అత్యుత్తమ పి యం శ్రీ పాఠశాలకు ఎంపిక కావడం తనకు చాలా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల లోని కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ లను పరిశీలించారు. పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్ కి ఫాల్ సీలింగ్, ఏసీలు, డయాస్ పై కప్పు ఏర్పాటు అతి త్వరలో చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య వ్యవస్థను గాడిలో పెడుతూ ఎక్కడ లేని నూతన టెక్నాలజీ తో విద్యను అందించాలనే సంకల్పంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
విద్య పట్ల మక్కువ స్పోరట్స్ స్కూల్ కూడా మంజూరు చేశారని, ఆగస్టు 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అన్నారు. అనంతరం అండర్ 14 బాక్సింగ్ పోటీలో బ్రాండ్ మెడల్ సాధించిన విద్యార్థి వైష్ణవి నీ శాలువతో సత్కరించి అభినందించిన ఎమ్మెల్యే నాగరాజు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ శ్రీ ఎ. శ్రీనివాసరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు ఎస్. రజిత, సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.చేరాలు, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కె. కిరణ్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు టీ.తిరుపతి, మాజీ జడ్పిటిసి వింజమూరి వెంకటేశ్వర్లు, పెద్దమ్మ నరసింహారాములు, వీసం సురేందర్ రెడ్డి, జన్ను రవీందర్, గొర్రె కిరణ్ కుమార్, తాళ్ల మధు, బిగుల సురేష్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.