calender_icon.png 1 August, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

30-07-2025 12:59:06 AM

వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్

కాగజ్‌నగర్, జూలై ౨౯ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు  కృషి చేయాల ని  వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్. అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మందులు, వైద్య సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు గుత్తుదారు వేతనాలు సకాలంలో ఇవ్వడం  లేదని కమిషనర్‌కు ఫిర్యా దు చేశారు.

సత్వరమే స్పందించిన కమిషనర్ గుత్తేదారు పని తీరుపై మండిపడ్డారు. ఆసుపత్రిలోని పలు సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు ఆయన దృష్టికి తెచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపడేల చర్యలు చెపట్టాలని వర్షం కాలంలో సిజినల్ వ్యాదులు వస్తున్న నేపథ్యంలో డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నా రు.ఆసుపత్రిలోని సమస్యలపై సూపరిండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.