01-08-2025 12:33:58 AM
రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
అలంపూర్, జూలై 31 : కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నా రు. గురువారం అలంపూర్ చౌరస్తా లోని ఫంక్షన్ హాల్ నందు ఇందిరా మహిళా శక్తి, రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో జిల్లా క లెక్టర్ బి.యం సంతోష్,అలంపూర్ శాసన స భ్యులు విజయుడుతో కలిసి పాల్గొని,జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళల పేరు మీద అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. గతంలో ఏడాదికి ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే, ఇప్పుడు మూడు నెలలకు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం 2600 మహిళా సంఘాలకు వడ్డీ లేని రూ.3.15 కోట్ల రుణాలను అందించిందని వెల్లడించారు.
తాము నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను రూ.175 కో ట్లతో పార్టీలకతీతంగా, అవినీతికి తావు లే కుండా నిర్మించి ఇస్తున్నామన్నారు. గృహ అవసరాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పెట్రోల్ బంకులు, 1000 బస్సులకు యజమానులుగా చేసి మహిళలను నెలకు 59 వేల రూపాయల ఆదాయం కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.
భవిష్యత్ తరాల కోసం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు. అర్హులైన వారికి నూతన రేషన్ కార్డులు అం దజేస్తున్నామని తెలిపారు. సన్న బియ్యం పథకాన్ని దేశంలోనే ప్రత్యేకంగా అమలు చే స్తున్నామని పేర్కొన్నారు.ఇంకా అనేక మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా చేరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ముందుకు సాగాలని వారికి పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలలోనే ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా నెర వేర్చడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో అవసరం మేరకు అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యే యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బలమైన చర్యలు... జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలి పారు. వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలు, యూనిఫామ్ తయారీ, వడ్ల కొను గోలు కేంద్రాల వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.
అనంతరం అలంపూర్ నియోజకవర్గంలోని 2041 మహిళా సంఘాల సభ్యులకు 30.58 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును, 2600 సంఘాలకు 3.15 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. మృతి చెందిన 23 మంది మహిళా సంఘాల స భ్యుల కుటుంబాలకు 13.89 లక్షల బీమా చెక్కులను, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఉత్తర్వులను అందజేశారు.
తదనంతరం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం లో భాగంగా గొర్రెలకు నీలినాలుక వ్యాధి ని రోధక టీకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అలంపూర్ శాసనసభ్యులు విజయు డు, అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, న ర్సింగ రావు, ఆర్డీవో అలివేలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడప్ప, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.