10-02-2025 12:46:45 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): తెలంగాణలోనూ డబుల్ ఇం జిన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఉం దని, ఆ దిశగా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు.
పార్టీ జెండాలతో కార్యకర్తలు పెద్దఎత్తున ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. డప్పులుకొడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రేణులనుద్ధేశించి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. 27ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందన్నారు. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతోందన్నా రు.
ఏపీ, యూపీ, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఢిల్లీలోనూ భవిష్యత్‌లో అభి వృద్ధి చేసి చూపిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నరేంద్రమోదీ నా యకత్వంలో నీతిమంతమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలకు దేశ వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో ఢిల్లీలోనూ డ బుల్ ఇంజిన్ సర్కారు వచ్చిందన్నా రు.
ఇదేరీతిన తెలంగాణలోనూ ప్ర భుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సంబురాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాయకులు చింతల రామచంద్రారెడ్డితోపాటు తదితరులున్నారు.