17 April, 2026 | 8:28 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

వైభవంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన

07-06-2025 12:20 AM

ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, పలువురు ప్రముఖుల ప్రత్యేక పూజలు

ఘట్ కేసర్, జూన్ 6 (విజయక్రాంతి) :  ఘట్కేసర్ మున్సిపల్ అవుషాపూర్ లో శుక్రవారం గ్రామ నాభిశిల బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. బ్రాహ్మనోత్రముల మంత్రో చరణాల మధ్య అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగిన ఈమహోత్సవంలో  మేడ్చల్ ఎమ్మెల్యే చామ కూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈపూజా కార్యక్రమాలలో ఉదయం మంటపారాధన మూల విగ్రహ పంచా మృత అభిషేకం, యంత్రం ప్రతిష్ట విగ్ర హ ప్రతిష్ట నిర్వహించారు. గ్రామ ప్రజ లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో విగ్రహ ప్రతిష్ట ప్రాంగణం కిక్కిరిసిపో యింది. ఈమహోత్సవంలో పాల్గొన్న భక్తజనులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యు లు ఏర్పాట్లను చేశారు.

ఈ సందర్భంగా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు ఏనుగు సుదర్శన్ రెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ డొంకెని బిక్షపతి గౌడ్, ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఎల్సాని  ఐలయ్య యాదవ్,  బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి,  నాయకులు కవాడి బ్రదర్స్ మాధవరెడ్డి, వామన్ రెడ్డి, డొంకెని శంకర్ గౌడ్, బొడిగె శ్రీనివాస్ గౌడ్, వీరేశం, తదితరులు పాల్గొన్నారు.కీసరలో..కీసర మండల కేంద్రంలోని శ్రీ మరియమ్మ ఆలయం లో మరియమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన 

మాజీ మంత్రి మల్లారెడ్డి 

మేడ్చల్, జూన్ 6(విజయ క్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముస్లింలకు బక్రీదు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, సహనానికి, దాన గుణానికి, సోదర భావానికి ప్రతీక బక్రీద్ పండుగ అన్నారు. ముస్లింలు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలనిఅన్నారు.