నేటి యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, జూన్6: ఛత్రపతి శివాజీ హిందూ హృదయ సామ్రాట్ అని, హిందూ ధర్మ స్థాపన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొ న్నారు. శుక్రవారంనార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట గ్రామంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్ర హ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ పోరాటయోధుడని కొనియాడారు. హిందూ ధర్మ స్థాపన కోసం ఆయన చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. హిందూ సోదరులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరూ ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
నేటి యువత శివాజీని అడుగుజాడల్లో నడవాల్సిన అవ సరం ఉందని తెలియజేశారు. మన పిల్లలకు శివాజీ పోరాటాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు..అనంతరం జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో ప్రజలుపాల్గొన్నారు.






