17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఉచిత యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

07-06-2025 12:18 AM

సూర్యాపేట జూన్ 6 (విజయక్రాంతి) : ఈ నెల 9 నుండి ఈనెల 21 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయము ,సాయంత్రం రెండు బ్యాచ్ లు గా  నిర్వహించే ఉచిత యోగ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి అన్నారు.

శుక్రవారం సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:45 వరకు నిర్మల హాస్పిటల్ రోడ్డు కవి సాగర్ హాస్పిటల్ ప్రక్క బజారులో, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల వరకు బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ఈ యోగా శిక్షణ క్లాసులు  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

యోగా శిక్షణ ద్వారా బిపి ,డయాబెటిస్ నడుమునొప్పి, వెన్నునొప్పి, సయాటికా, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, తలనొప్పి మైగ్రేన్, థైరాయిడ్, ఓ బి సి టి మొదలగు వ్యాధులు, మానసిక సంబంధమైన వ్యాధులు, మహిళలకు రుతు సంబంధిత వ్యాధులు యోగ వల్ల  నివారించుకోవచ్చు అన్నారు.  కావున ఈ యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు సమాచారం కోసం 9849804626 నెంబర్ను సంప్రదించాలన్నారు.