09-08-2025 07:44:12 PM
- జడ్చర్ల విద్యా రంగంలో స్వర్ణయుగం ప్రారంభం
- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కృషి ఫలితంగా ఎడ్యుకేషన్ హబ్ గా మారుతున్న జడ్చర్ల
- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి కాంగ్రెస్ నేతల కితాబు
- విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి
మిడ్జిల్: జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) కృషి ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గం ఎడ్యుకేషన్ హాబ్ గా మారుతుందని బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. శనివారం మిడ్జిల్ మండల కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలానగర్ మండలం పెద్దయిపల్లి సమీపంలో జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రూ.150 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మహబూబ్‌నగర్ – జడ్చర్ల మధ్య ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు కావడం విద్యారంగ అభివృద్ధికి పెద్ద ఉదాహరణ అన్నారు.
ఎంపీ డీకే అరుణమ్మ సహకారంతో జవహర్ నవోదయ విద్యాలయం బాలానగర్ మండలం పెద్దయిపల్లి దగ్గర మంజూరు చేయించారు. జడ్చర్ల నియోజకవర్గాన్ని విద్యా ప్రగతిపథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కృషి ప్రశంసనీయం అన్నారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, వెంకటయ్య, సాయిలు, మల్లికార్జున్ రెడ్డి, గౌస్, బంగారు, నరేందర్ రెడ్డి, విజయ్ కుమార్, ఉస్మాన్, పర్వతాలు, శ్రీనివాస్ నాయక్,శివ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.