09-08-2025 07:39:17 PM
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్...
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): సోదర, సోదరిమణుల అందమైన అనుబంధానికి ప్రతిరూపం రాఖీ పండుగ అని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్(Congress Party State Leaders Kuna Srisailam Goud) అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur Constituency) పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్దకు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు, కార్యకర్తలు, అక్క చెల్లమ్మలు పెద్దసంఖ్యలో తరలివచ్చి మాజీ ఎమ్మెల్యేకి కోలాట నృత్యాలు, శంకు ధ్వనులతో స్వాగతం పలికి ప్రతి ఒక్కరు రాఖీ కట్టి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, నియోజకవర్గం నుండి పెద్దసంఖ్యలో తరలివచ్చిన అక్క చెల్లమ్మలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములతో పాటు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి ద్వారా అక్క చెల్లమ్మలు మీ అందరి జీవితంలో వెలుగులు జిమ్మేలా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.