calender_icon.png 29 October, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్ పహాడ్ లో 'బిఆర్ఎస్' కు బిగ్ షాక్

28-10-2025 11:14:32 PM

టిఆర్పీలో చేరిన పెన్ పహాడ్ మాజీ జడ్పిటిసి 'మామిడి అనితా అంజయ్య'

సూర్యాపేట (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెన్ పహాడ్ మండల తాజా, మాజీ జడ్పీటీసీ 'మామిడి అనితా అంజయ్య' మంగళవారం హైదరాబాదులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్బంగా అంజయ్యను టీ ఆర్ పీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. సమాజంలో సింహాభాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోనే రాజ్యాధికారమే లక్ష్యంగా స్థాపించిన టిఆర్పీ బహుజన వాదంతో దూసుకెళ్తుందన్నారు.

అంతేకాదు తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు దక్కకుండా అడ్డుకుంటున్న అగ్రకుల పార్టీలకు ఇక చెమటలు పట్టడం ఖాయమన్నారు. అగ్రవర్ణ పార్టీలకు బహుజనులు ఊడిగం చేయటం ఎన్నాళ్లని, ఎన్నికల్లో యంత్రాల్లా వాడుకుంటున్న అగ్రకులాల వారి ఆటలు ఇక సాగవు సాగనియ్యబొమన్నారు. అగ్రవర్ణ పార్టీలో ఉన్న బహుజనులారా ఇకనైనా మేల్కొని టిఆర్పీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, జిల్లా నాయకులు మీర్ అక్బర్, ఆవుల అంజయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి ఉప్పల మల్లయ్య, యాదవ్, బొల్లె సైదులు, వెంకటేష్, మామిడి ఉదయ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.