28-10-2025 11:09:27 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ నిన్న నలుగురు పోలీస్ అధికారులకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వారిలో ఒకరు ఆదిలాబాద్ వాసి ఉన్నారు. ఆదిలాబాద్ లోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ లో డీసీపీగా పని చేస్తున్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ విభాగంలో సైతం పని చేశారు. శ్రీనివాస్ కు ఐపీఎస్ గా హోదా కల్పించడంతో హౌసింగ్ బోర్డ్ వార్డు మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్ తో పాటు కాలనీ వాసులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.