calender_icon.png 29 October, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విద్యార్థికి మన్నె జీవన్ రెడ్డి ఆర్థిక చేయుత

28-10-2025 10:43:12 PM

రూ. లక్ష 35వేల ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ టౌన్: నిరుపేద వైద్య విద్యార్థికి ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నాయకులు మన్నె జీవన్ రెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి తండాకు చెందిన కడావత్ రాజేశ్వరి ఎంతో కష్టపడి చదివి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ లో సీటు సాధించింది. ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా కాంగ్రెస్ నాయకులు మన జీవన్ రెడ్డి ఆర్థికంగా చేయూత అందించారు.

కళాశాల ఫీజు రూ. లక్ష 35వేలు ను ఆన్ లైన్ లో విద్యార్థికి పంపించారు. ఈ సందర్భంగా మన్నే జీవన్ రెడ్డికి రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మన్నే జీవన్ రెడ్డి ఎంతోమందికి వైద్య చికిత్సల కోసం, విద్యార్థుల ఫీజుల కోసం ఆర్థిక సాయం అందజేశారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి వచ్చిన వెంటనే ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు మన్నే జీవన్ రెడ్డి.