28-10-2025 10:33:43 PM
మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ హెచ్చరిక..
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో పశువులు కనిపిస్తే పదివేల జరిమానా విధిస్తామని మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంథని పురపాలక సంఘం పరిధిలోని పశువుల యజమానులు తమ యొక్క పశువులను రోడ్లపై వదిలిపెట్టడం వల్ల అనేక రకాల ప్రమాదములు జరుగుతున్నవని, మంథని పట్టణంలోని పశువుల యజమానులు తేది: 01.11.2025 శనివారం నుండి రోడ్లపై ఇక పశువులను వదలవద్దని, మీ ఇంటి ఆవరణలో కట్టివేసుకోగలరని తెలియజేశారు. రోడ్లపై పశువులు కనిపిస్తే ఇక రూ.10 వేల జరిమానా విధించి గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. పట్టణంలోని పశువుల యాజమాన్యులు మీ పశువులను మీ ఇంటి వద్ద ఉంచుకొని రోడ్డు ప్రమాదాలు జరగకుండా సహకరించాలని కోరారు.