calender_icon.png 29 October, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రిని కలిసిన నిర్మల్ నేతలు

28-10-2025 10:54:54 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో సోయపంట పునుగులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి మంగళవారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును విన్నవించారు. పంటను తొందరగా కొనుగోలు చేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరిరావు తీసుకువెళ్లారని తెలిపారు. వెంటనే స్పందించి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సోయాబీన్ పంటకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,328 చొప్పున మద్దతు ధరను ప్రకటించిందని అన్నారు.