10-09-2025 12:54:03 AM
-మెయిన్స అభ్యర్థుల డిమాండ్
- పునఃమూల్యాంకనమా? మళ్లీ పరీక్ష?
-నిర్ణయంపై టీజీపీఎస్సీ తర్జనభర్జన
-కోర్టు తీర్పును సవాల్ చేసే యోచనలో కమిషన్
-అవసరమైతే సుప్రీంకు వెళ్లేందుకు సిద్ధం
-డివిజన్ బెంచ్‌కు వెళ్లే యోచనలో ఎంపికైన అభ్యర్థులు
-రీవాల్యూయేషన్ సాధ్యమవకపోతే మళ్లీ పరీక్షలు!
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గ్రూప్ ఫలితాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ ఏం చేయాలనే అంశమై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. బాధిత అభ్యర్థులు మాత్రం మళ్లీ గ్రూప్ పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. మరోవైపు 1:1కు ఎం పికై, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు మాత్రం డివిజన్ బెంచ్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
టీజీపీఎస్సీ కూడా ఈ విషయంలో తీర్పును సవాల్ చేయాలని భావిస్తోంది. మంగళవారం గ్రూప్ మెయిన్స్ ఫలితాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా మెయిన్స్ పేపర్లను పునఃమూల్యాంకనం చేయాలని, ఆ మార్కుల ఆధారంగానే ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది. ఒకవేళ పునఃమూ ల్యాంకనం చేయడం వీలు కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహిం చాలని న్యాయస్థానం ఆదేశించింది.
8 నెలల్లో రీవాల్యూయేషన్ చేయాలి లేదా మళ్లీ పరీక్షలైనా నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏం చేయాలనే దానిపై టీజీపీఎస్సీ అధికారులు కసరత్తు చే స్తున్నారు. న్యాయ సలహా తీసుకొని డివిజన్ బెంచ్‌కు వెళ్లాలా? లేదా రీవాల్యుయేషన్ చేయాలా? లేకుంటే మళ్లీ పరీక్షలు నిర్వహించాలా? అనే దానిపై సమాలోచనలు చేస్తోం ది. ఒకవేళ డివిజన్ బెంచ్‌లోనూ తీర్పు అనుకూలంగా రాకపోతే టీజీపీఎస్సీ అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం.
జరిగిందిదీ..!
511 పోస్టులతో బీఆర్‌ఎస్ హ యాంలో జరిగిన గ్రూప్ ప్రిలిమ్స్ పేపర్ లీక్ అవ్వడంతో ఆ పరీక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి 563 ఉద్యోగాల భర్తీకి 2024, ఫిబ్రవరి 19న మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 4,03,465 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. జూలై 7న ఫలితాలు విడుదల చేసి, 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి 31,383 మందిని మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేశారు.
మెయిన్స్ పరీక్షలు గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగాయి. మొత్తంగా 21,093 మంది మొత్తం ఏడు పేపర్లూ రాశారు. ఈ ఏడాది మార్చి 10న ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేశారు. మార్కుల రీకౌంటింగ్‌కు అదే నెల 24 వరకు అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి చేసి ఏడు పేపర్లలో మొత్తం సాధించిన మార్కుల వివరాలతో కూడిన దాదాపు 12 వేల మంది తో జీఆర్‌ఎల్‌ను కమిషన్ విడుదల చేసింది.
అయితే గ్రూప్ మూ ల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, పరీక్షలు ర ద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసినవారే ఎక్కువ మంది ఉద్యోగానికి అర్హత సాధించారని, తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వేసి, ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసినవారికి ఎక్కువ మా ర్కులు వేశారనేది పిటిషనర్ల వాదన. మరోవైపు పరీక్షలు రద్దు చేయొద్దని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది.
ముందు నుంచి వాళ్లు చెబుతున్నదిదే..
గ్రూప్- మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ముందు నుంచి కోర్టు ముందు తమ వాదనలు బలంగా వినిపిస్తూ వచ్చారు. పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూ ల్యాంకనంలో లోపాలు ఉన్నాయని, మోడరేషన్ ప్రాసెస్‌ను ఫాలోకాలేదని చెబుతు న్నారు. అంతేకాకుండా అర్హత లేని వారు మూల్యాంకనం చేశారన్నారు. 21 వేల మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5 వేల మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్ జరిపారని, ఇలా అడుగడుగునా అవకతవకలు చోటుచేసుకున్నాయని వాదనలు వినిపించారు.
జీఆర్‌ఎల్ జాబితాలో 12 వేల మందికిపైగా అభ్యర్థులున్నట్టు సమాచారం. టీజీపీఎస్సీ కూడా ఈ విషయంలో తమ వాదనలను కోర్టు ముందు వినిపించింది. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మూల్యాంకనంలో సందేహాలున్న చోట రెండు, మూడుసార్లు మూల్యాంకనం కూడా చేసింది. ఈక్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని కమిషన్‌తోపాటు ఎంపికైన అభ్యర్థులు కూడా భావిస్తున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి నియామకపత్రాలు అందుకొనే వేళ హైకోర్టు తీర్పు ఈ విధంగా రావడంతో ఆయా అభ్యర్థులు తీవ్రఆవేదన చెందుతున్నారు. వీరు కూడా డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. ఒకవేళ మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే దాదాపు ఆరు నెలలపైనే సమయం పట్టే అవకాశం ఉంది.
పరీక్షలు మళ్లీ పెట్టాలి
గ్రూప్ మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలి. ప్రిలిమినరీ, మెయిన్స్ హాల్‌టికెట్లు వేర్వేరుగా ఇవ్వకుండా ప్రిలిమినరీ హాల్‌టికెట్‌తోనే మెయిన్స్ హాల్‌టికెట్ ఇవ్వాలి. రీవాల్యుయేషన్ జరిపినా మళ్లీ న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి. పునఃమూల్యాకనంలో ఇప్పుడు ఎంపికైన వారికి తక్కువ మార్కులొచ్చి ఎంపికవ్వకుంటే వారు మళ్లీ కోర్టుకు వెళ్తారు. ఇలా నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే రీమెయన్స్ పెట్టడమే ఉత్తమం.
రీవ్యాల్యుయేషన్ సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పటికే ఓఎంఆర్ షీట్ల మీద మార్కులు వేయడం, బార్ కోడ్ చించేయడం చేస్తారు. అందుకే దానికి వెళ్లకుండా పరీక్షనే మళ్లీ నిర్వహించాలని కోరుతున్నాం. కొన్ని సెంటర్లలోనే పరీక్షలు రాసిన అభ్యర్థులు ఎక్కువగా ఎంపికవడం, పరీక్ష రాసిన వారి సంఖ్యలో వ్యత్యాసాలు ఉండటం, తెలుగు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల మార్కుల్లో వ్యత్యాసం, వ్యాల్యుయేషన్ చేసేటప్పుడు నిబంధనలు పాటించకపోవడం లాంటి చాలా అంశాల్లో కమిషన్ నిబంధనలు పాటించలేదు.
అభినవ్ కుమార్, గ్రూప్ అభ్యర్థి
సీబీఐ విచారణ జరపాలి
గ్రూప్ పరీక్షల మెయిన్స్ ఫలితాల రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చి న తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. ప్రభుత్వాలు మారితే టీఎస్‌పీఎస్సీ పేరు టీజీపీఎస్సీగా మారింది తప్పి తే బోర్డు తీరులో మార్పు రాలే దు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడు తోంది. వెంటనే టీజీపీఎస్సీ బో ర్డును రద్దు చేయాలి. గ్రూప్ పరీక్షల వ్యవహారంపై సీబీఐతో విచార ణకు ప్రభుత్వం ఆదేశించాలి.
-- రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు