calender_icon.png 10 September, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డును మింగిన అపర్ణ గోడలు

10-09-2025 01:04:23 AM

  1. సంగారెడ్డి జిల్లా ఈదుల నాగులపల్లిలో రేడియల్ రోడ్డుకు సమాంతరంగా నిర్మాణం

గ్రామానికి నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు

తాత్కాలిక మట్టి రోడ్డుపైనే రవాణా

అక్రమార్కులకు అండగా అధికారులు!

గ్రామస్థుల ఫిర్యాదును పట్టించుకోని యంత్రాంగం

సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో అపర్ణ నిర్మాణ సంస్థ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నది. దీంతో ఈదులనాగులపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపో యాయి. ఈ రోడ్డు నిర్మా ణం పూర్తయితే ఆ గ్రామానికి పూర్తిగా రోడ్డు సౌకర్యం నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయమై గ్రామస్థులు అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించుకోవడంలేదు.

సదరు బడా నిర్మాణ సంస్థకు అక్కడ వందల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్నా.. ప్రభుత్వానికి చెందిన స్థలంలో, రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిని మూసి ఈ భారీ గోడలు నిర్మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, సంగా రెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం గుండా కొండకల్, నాగులపల్లి శివార్లను కలుపుతూ రేడియల్ రోడ్డు వెళ్తోం ది. నాగులపల్లి గ్రామానికి ఆనుకొని సదరు నిర్మా ణ సంస్థకు వందల ఎకరాల భూమి ఉంది.

గ్రామానికి సంబంధించి ఓ రైల్వే స్టేషన్ కూడా ఉంది. అక్కడ అవేమీ కనిపించకుండా, రేడియల్ రోడ్డుకు సమాంతరంగా భారీ గోడలు నిర్మించడంతో అసలు గ్రామానికి ఆర్టీసీ రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది.

ఆర్టీసీ బస్సు సేవలు బంద్

ఈదుల నాగులపల్లి మీదుగా గతంలో ఆర్టీసీ బస్సు సేవలు నడిచేవి. అపర్ణ నిర్మాణ సంస్థ పుణ్యమా అని ప్రస్తుతం ఆర్టీసీ బస్సు సేవలకు ఆ గ్రామం నోచుకోవడం లేదు. అపర్ణ నిర్మాణ సంస్థకు సంబంధించిన భూములకు రేడియల్ రోడ్డును ఏర్పాటు చేశారు. రేడియల్ రోడ్డు వేసే ముందు గ్రా మానికి బస్సు సౌకర్యం ఉండేలా రోడ్డు సౌకర్యాన్ని మాత్రం మరిచిపోయారు.

ప్రస్తు తం రేడియల్ రోడ్డుకు ఇరువైపులా గ్రామం, రైల్వే స్టేషన్ కనిపించనంతగా భారీ గోడలను అపర్ణ సంస్థ నిర్మిం చింది. రేడియల్ రోడ్డు నిర్మించక ముందు నేరుగా గ్రామానికి పాత రోడ్డు గుం డా ఆర్టీసీ బస్సు గ్రామానికి వచ్చేది. రేడియల్ రోడ్డుపై అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయడంతో ఆ మార్గం గుండా రైల్వే స్టేషన్‌కు రాకపోకలకు గ్రామస్థులు దారిని ఏర్పాటు చేసుకున్నారు.

ఆయా పాఠశాలల బస్సులు, ఆర్టీసీ బస్సు తిరగడానికి అండర్ బ్రిడ్జి కింద నుంచి రావ డం కుదరదు. దీంతో ఆర్టీసీ బస్సును రేడియల్ రోడ్డుకు వ్యతిరేకంగా బస్సు ప్రయా ణించి యూటర్న్ తీసుకొని గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న మట్టి రోడ్డు ద్వా రా కొన్ని రోజులు బస్సు నడిచేది. ఇటీవలే భారీ వర్షాలు కురవడంతో మట్టి రోడ్డు పూ ర్తిగా బురదమయంగా మారడంతో ఆర్టీసీ బస్సు సేవలు నిలిపివేశారు. కేవ లం వాహనదారులు, కార్లు మాత్రమే ఈ రోడ్డు గుండా ప్రయాణించడం నరకంగా మారింది. 

అధికారులకు తెలిసే నిర్మాణాలు?

నాగులపల్లిలో నిర్మిస్తున్న భారీ ప్రహారీల విషయం అధికారులకు తెలిసే జరిగినట్లు స్పష్టమవుతోంది. రామచంద్రాపురం తహసీల్దార్‌కు గ్రామస్థులు పలుమార్లు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. గోడల నిర్మాణాలు ప్రారంభమయ్యే సమయంలో ఫిర్యాదులు చేసిన గ్రామస్థులకు అవి ఆర్‌అండ్‌బీ శాఖ నిర్మిస్తోందని కప్పిపుచ్చిన అధికారులు..

అటు తరువాత రైల్వే డిపార్ట్‌మెంట్ నిర్మిస్తోందని ఫిర్యాదుదారులను దారి మళ్లించా రు. కానీ అపర్ణ నిర్మాణ సంస్థ ప్రలోభాలకు లొంగి ఈ గోడల విషయంలో అందరినీ తప్పుదారి పట్టించారని, సదరు సంస్థపై చర్య లు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. 

విచారించి చర్యలు తీసుకుంటాం

ఈదుల నాగులపల్లిలో ఆర్టీసీ సేవలు నిలిచినట్లు నాకు తెలియదు. నేను ఇటీవలే ఉద్యోగ బాధ్యతలు చేపట్టాను. ఈ గ్రామానికి సిటీ బస్సు సర్వీసులు నడిస్తే అది నా పరిధిలోకి రాదు. జిల్లా సర్వీసులు నడిస్తే విచారించి తగు చర్యలు తీసుకుంటాం. 

 విజయభాస్కర్, ఆర్‌ఎం, సంగారెడ్డి

రోడ్డు కనెక్టివిటీని తొలగించారు

అపర్ణ నిర్మాణ సంస్థ తమ వెంచర్ కోసం ఏర్పాటు చేసుకున్న రేడియల్ రోడ్డు వల్ల మా గ్రామానికి రహదారి కనెక్టివిటీ పూర్తిగా తొలగిపోయింది. అధికారులు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి మా గ్రామానికి రహదారి అనుసంధానం లేకుండా చేశారు. తప్పని పరిస్థితుల్లో తాత్కాలికంగా మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకున్నాం. రేడియల్ రోడ్డు వల్ల మా గ్రామానికి ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి.

మేము ఏర్పాటు చేసుకున్న మట్టి రోడ్డుపైనే రవాణా సాగినా వర్షాల వల్ల పూర్తిగా బురద మయంగా మారి రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మట్టి రోడ్డుకు వదిలిపెట్టిన గోడలను భవిష్యత్తులో పూర్తి చేస్తే మా గ్రామానికి పూర్తిగా రహదారి లేకుండా పోతుంది. ఇందులో అధికారులు అపర్ణ సంస్థకు సహకరించి గ్రామస్తుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.

 శంషాబాద్ రాజు, మాజీ కౌన్సిలర్, నాగులపల్లి