calender_icon.png 12 January, 2026 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ సవరణతో రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం

06-01-2026 01:24:55 AM

తెలంగాణ జీఎస్టీ(సవరణ) బిల్లు-2026’ను ప్రవేశపెట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు 

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి) : జీఎస్టీ సవరణతో రాష్ట్రానికి రూ.7వేల కో ట్ల నష్టం వాటిల్లుతోందని, కేంద్రానికి వెళ్లేది ఎక్కువగా ఉందని  పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన ‘తెలంగాణ వస్తు, సేవల  పన్ను(జీఎస్టీ) సవరణ బిల్లు-2026’ను ప్రభు త్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున మంత్రి జూపల్లి కృ ష్ణారావు ఈ బిల్లును సభ ముందు ఉం చారు. గత ఏడాది నవంబర్‌లో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ నూతన బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. అయి తే జీఎస్టీ సవరణ వల్ల రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల న ష్టం జరిగిందని తెలిపారు. మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు.