calender_icon.png 12 January, 2026 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేపీహెచ్‌బీలో ‘హరిత ఐవీఎఫ్ సెంటర్’

06-01-2026 01:25:35 AM

పేదలకు ఉచిత కన్సల్టేషన్ అవకాశం 

జనవరి 31 వరకు ఐవీఎఫ్‌పై డిస్కౌంట్

హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): కేపీహెచ్‌బీ ఫేజ్-1లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ‘హరిత ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్‌ను’ సోమవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ శిరీష బాబురావు ప్రారంభించారు. ‘ఆశల చిగురు కొత్త ఆరంభం‘ అనే నినాదంతో, మహిళలు, శిశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా అత్యాధునిక వైద్య సేవలను అందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పాస్టర్ కె శ్యామ్ కిషోర్ (జేసీఎన్‌ఎం మినిస్ట్రీస్) విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ హరిత, డాక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ.. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రోగులందరికీ ఉచితంగా వైద్య సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ శాంతకుమారి (ప్రెసిడెంట్, ఫోగ్సి), డాక్టర్ మంజుల అనగాని (పద్మశ్రీ అవార్డు గ్రహీత), డాక్టర్ చంద్రమోహన్ (ప్రెసిడెంట్, ఐఎంఏ కేపీహెచ్‌బీ), పనబాక కృష్ణయ్య (మాజీ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఐఆర్‌ఎస్), కె. ప్రకాష్‌రావు (ఏసీపీ, విజయవాడ), వై. ఏంజెల్ దేవి (దైవ సేవకురాలు, విజయవాడ) పాల్గొన్నారు.