07-05-2025 12:00:00 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేశ్ కనగారాజ్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్, ఉపేంద్ర చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్కినేని నాగార్జున ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై తమిళంలోనే కాదు టాలీవుడ్‌లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి.
అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఇదే విషయాన్ని మరోమారు వెల్లడిస్తూ తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు. మంగళవారం నుంచి సరిగ్గా 100 రోజుల్లో ‘కూలీ’ ప్రేక్షకుల ముందుకొస్తోందని పేర్కొంటూ రూపొదించిన ఈ వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది.