07-07-2025 08:05:06 PM
తూప్రాన్ (విజయక్రాంతి): దళిత వర్గాల అభ్యున్నతి కోసం వెనుకబడిన మాదిగ వర్గాన్ని ముందుకు నడిపించిన ఘనత మందకృష్ణ మాదిగదని ఎమ్మార్పీఎస్(MRPS) నాయకులు వారిని అభివర్ణించారు. ఈ సందర్భంగా 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేసుకొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం మందకృష్ణ మాదిగ జన్మ దిన్నాని పురస్కరించుకొని బర్త్డే కేకును కట్ చేసుకుని నోరు తీపి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎఫ్ డి సి. చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి హాజరై విజయవంతం చేశారు, ఈ సందర్భంగా ఆయనను ఎమ్మార్పీఎస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు వారితో పాటు పలువురి నాయకులను సన్మానించారు. ఇందులో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, చంద్రారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, మహిళలు, పలువురు పాల్గొన్నారు.