calender_icon.png 8 July, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగ శిక్షకునికి పురస్కారం

07-07-2025 07:54:42 PM

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన యోగ శిక్షకులు చిలువేరు సైదులుకు సర్వేజనా సుఖినోభవంతు ఫౌండేషన్(Sarvejana Sukhinobavantu Foundation) ఉత్తమ పురస్కారం అందజేసి సత్కరించారు. యోగా గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరుస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నందుకు గుర్తింపుగా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యోగా చేయడం వలన మానసిక ఒత్తిడి ఆందోళన దూరమవుతాయని ప్రాణాయామం చేయడం వలన రుగ్మతలను తొలగించుకోవచ్చని ప్రతి ఒక్కరు రోజులో ఒక గంట పాటు యోగాకు సమయం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. తన సేవకు గుర్తింపుగా ఇచ్చినటువంటి పురస్కారానికి సర్వేజన సుఖినోభవంతు ఫౌండేషన్ చైర్మన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.