calender_icon.png 8 July, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

07-07-2025 07:49:37 PM

మందమర్రి (విజయక్రాంతి): జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ రాజశేఖర్(SI Rajasekhar) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన కటకం శ్రీనివాస్(45) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గతంలో లారీ డ్రైవర్‌ గా  విధులు నిర్వహించేవాడు. 15 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, శారీరకంగా ఏ పనీ చేయలేని పరిస్థితిలో ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య కటకం రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  వివరించారు.