07-07-2025 07:51:54 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): దౌల్తాబాద్ ఎస్సైగా అరుణ్ కుమార్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్సైగా పనిచేసిన శ్రీరామ్ ప్రేమ్ దీప్ బదిలీపై గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దుబ్బాక పోలీస్ స్టేషన్లో ట్రైని ఎస్సైగా విధులు నిర్వహించిన అరుణ్ కుమార్ దౌల్తాబాద్ ఎస్సైగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలోని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్న పోలీస్ స్టేషన్ కు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన పేర్కొన్నారు.