07-07-2025 07:44:23 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): రాయపోల్ ఎస్ఐగా మానస సోమవారం పోలీస్ స్టేషన్లో బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన రఘుపతి బదిలీపై గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తొగుట పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ ఎస్సైగా విధులు నిర్వహించిన మానస రాయపోల్ ఎస్సైగా వచ్చారు. ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన మానసను వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు సన్మానించారు. ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. చట్టాన్ని చేతులోకి తీసుకుంటే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల కోసం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్న పోలీస్ స్టేషన్ కు వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె పేర్కొన్నారు.