calender_icon.png 8 July, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు అండగా నిలుస్తా

07-07-2025 07:32:40 PM

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

హుజురాబాద్ (విజయక్రాంతి): ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి సోమవారం 31 మంది లబ్ధిదారులకు 7,88,500 విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద వచ్చి ప్రజలు తన ఇంటికి అర్ధరాత్రి వచ్చిన వారికి సహాయం చేయడానికి ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు. సిఎంఆర్ఎఫ్ పేదలకు వరమని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని అన్నారు.

ఆడబిడ్డల పక్షాన పోరాటం చేస్తా

ఆడ బిడ్డల పక్షాన పోరాటం చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 100 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత దేశంలోనే ఆడబిడ్డల  కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,116, లో కళ్యాణంలో కట్నంగా ఇచ్చి ఆడపిల్లలకు మేనమామ అయ్యాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ కిట్ నిలిపివేయడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు తగ్గాయని అన్నారు. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై రాజకీయం చేయకుండా అమలు చేయాలన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్య శ్రీ పథకాన్ని కేసీఆర్ మార్చకుండా కొనసాగించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 15000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయాలని  అన్నారు. కాలేశ్వరం నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నీళ్లను ఆంధ్రకు  తరలిస్తే ఊరుకోబమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో. హుజరాబాద్ మాజీ ఎంపీపీ ఇరుమళ్ళ రాణి- సురేందర్ రెడ్డి సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి నవీన్, సేనా రెడ్డి, కృష్ణ ప్రసాద్, రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు కార్యకర్తలు పాల్గొన్నారు.