07-07-2025 07:37:58 PM
జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల నూతన ఎస్సైగా సోమవారం జే.కృష్ణారెడ్డి(SI J Krishna Reddy) బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన చంద్రమోహన్ సిద్దిపేట సిఎస్బి కి బదిలీపై వెళ్ళారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ జే.కృష్ణారెడ్డి మాట్లాడుతూ... మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన డయల్ 100 కి ఫోన్ చేయాలని తెలిపారు. మండల ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని అన్నారు.