12-08-2025 01:22:04 AM
150 పడకలతో ప్రారంభం
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): యూరో-నెఫ్రో చికిత్సలపై దృష్టిపెట్టిన భారతదేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రి చైన్ అయిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన ప్రధాన ఆస్ప త్రిని ప్రారంభించి, సరికొత్త మైలురాయి దాటింది. ఈ కొత్త ఆస్పత్రిలో 150 పడకలు, 4 ఆపరేషన్ థియేటర్లు, 34 డయాలసిస్ బెడ్లు, సంక్లిష్టమైన యూరాలజీ, నెఫ్రాలజీ శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ఉన్నాయి.
ఈ సందర్భంగా ఏఐఎన్‌యూ చైర్మన్, చీఫ్ కన్సల్టెంట్ యూరాల జిస్ట్ డాక్టర్ సి మల్లికార్జున మాట్లాడుతూ.. “రోగులకు చికిత్స చేయడంలో 12 ఏళ్ల వారసత్వాన్ని ఏఐఎన్‌యూ బంజారాహిల్స్ ఆస్పత్రి మరింత ముందుకు తీసుకెళ్తుంది. మేం సేవ చేసే వర్గాల ప్రయోజనం కోసం వైద్య విజ్ఞానాన్ని, పరిశోధనను, ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకెళ్తూ, వైద్యప రమైన విజయాలు సాధించే సంస్కృతిని నెలకొల్పుతున్నాం” అని తెలిపారు.
ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పీసీ రెడ్డి మాట్లాడుతూ.. “ఏఐఎన్‌యూ బంజారాహిల్స్ ఆస్పత్రి విస్తరణతో మేం యూరాలజీ, నెఫ్రాలజీలలో ఇంకా లోతుకు వెళ్లి.. యూరో- ఆం కాలజీ, ఆండ్రాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, ఫిమేల్ యూరాలజీ లాంటి సబ్ స్పె షాలిటీలపై దృష్టిపెడుతున్నాం” అని చెప్పా రు. ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ విశాల్ బాలి మాట్లాడుతూ,
“ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ద్వారా మేం దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ నెట్‌వర్క్ ఈ విభాగంలో ఏర్పాటుచేస్తున్నాం” అన్నారు. ఏఐఎన్‌యూ సీఈఓ సందీప్ గూడూరు మాట్లాడుతూ, “బంజారాహిల్స్ ఆస్పత్రి దేశంలోనే మా ప్రధాన ఆస్పత్రి అవుతుంది. దేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలకు అత్యంత నమ్మకమైన సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రిగా దీన్ని తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం” అనె తెలిపారు.