calender_icon.png 28 January, 2026 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారిపై వీధికుక్క దాడి

28-01-2026 12:42:26 AM

  1. ఇంటి ముందు ఆడుకుంటుండగా మీదపడి కరిచిన కుక్క
  2. ఖైరతాబాద్ శ్రీనివాస్‌నగర్‌లో ఘటన

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): ఖైరతాబాద్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో మంగళవారం నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడిచేసి, తీవ్రంగా గాయపరిచింది. శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మల్లికార్జున్, రేవతి దంపతుల కుమార్తె శార్వి (4) మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ వీధికుక్క ఒక్కసారిగా శార్విపై దాడి చేసింది. చిన్నారి ముఖంపై దాడి చేసి, మాంసాన్ని పీకేసింది.

చిన్నారి కేకలు విన్న స్థానికులు, అటుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వెంటనే స్పందించి కుక్కను తరిమివేయడంతో పెను ప్రమాదం తప్పింది. తీవ్ర గాయాలతో ఉన్న శార్విని బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. శార్వి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతోందని, పిల్లలను బయటకు పంపాలంటేనే భయం వేస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.