28-01-2026 12:43:12 AM
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా
బోథ్, జనవరి 27 (విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలో ఈనెల 28 నుండి నిర్వహించనున్న ‘ప్రేరణ’ (ఆదిలాబాద్ జిల్లా స్థాయి బాలికల క్రీడా, సాంస్కృతిక పోటీలు-2026) కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ ... క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జనవరి 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు ‘బాలికా సాధికారత - ప్రతిభను గుర్తించడం - భవిష్యత్తు నిర్మాణం‘ అనే నినాదంతో ఈ క్రీడా సంబరాలు జరగనున్నయని తెలిపారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రవికుమార్, సంక్షేమ శాఖల అధికారులు మిల్కా, రాజలింగం, డిడి అంబాజీ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.