calender_icon.png 21 January, 2026 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెస్‌ఛార్జీల పెంపు హర్షణీయం

22-10-2024 12:20:17 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ ఛార్జీల పెంపు హర్షణీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈమేరకు సీఎం, డిప్యూటీ సీఎంకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 8.50 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని కృష్ణయ్య పేర్కొన్నారు.