calender_icon.png 21 January, 2026 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయోడిన్ లోపాన్ని అధిగమించేందుకు చర్యలు

22-10-2024 12:21:07 AM

డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ శ్రీరాం

మెదక్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): అయోడిన్ లోపం వల్ల ఏర్పడే రుగ్మతలను అధిగమించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్ హెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అయోడిన్ కలిగిన ఉప్పును వాడేలా అవగాహన కల్పించాలన్నారు.  డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ నవీన్, డాక్టర్ సృజన, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, హెల్త్ ఎడ్యుకేటర్ రమ పాల్గొన్నారు.