07-05-2025 10:57:17 PM
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి వీపీ గౌతమ్...
హనుమకొండ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండి) విపి గౌతమ్ అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 58వ డివిజన్ పరిధి ఎన్జీవోస్ కాలనీలోని లబ్ధిదారులకు ప్రొసీడింగ్ అందజేశారు. హౌసింగ్ ఏఈ రాకేష్ కు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పట్ల పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విపి గౌతమ్ మాట్లాడుతూ.. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసుకుంటే దశలవారీగా బిల్లులను అధికారులు వెంటనే మంజూరు చేస్తారని లబ్ధిదారులకు సూచించారు.
ఆయన వెంట గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, అడిషనల్ కమిషనర్ గుడిశాల రవీందర్ గౌడ్, హౌసింగ్ ఏఈ రాకేష్, వార్డు ఆఫీసర్ శ్యాంసుందర్, 58వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి సుధాకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మండల సమ్మయ్య, తాళ్ల పెళ్లి రవీందర్, తాళ్ల పెళ్లి మేరీ, తాళ్లపల్లి విజయ్, ప్రసన్న, ఎన్ అజయ్, ప్రసంగి తదితరులు పాల్గొన్నారు.