ఘనంగా జాతీయ జెండావిష్కరణ
సమాచార హక్కు చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహణ
వరంగల్, ఆగస్టు 15(విజయక్రాంతి): సమాచార హక్కు చైతన్య సమితి (ఎస్‌హె చ్‌సీఎస్) ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పూర్ణచందర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. అనంతరం సమాచార హక్కు చైతన్య సమితికి సంబంధించిన అధికారిక వాల్ పోస్టర్‌ను నాయకులు, ప్రతినిధుల సమక్షం లో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భం గా వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని, ప్రతి పౌరుడు చట్టం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో చిమ్మనీ లత (రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు), గుటోజ్ వేణు (రాష్ట్ర కార్యదర్శి), ఆడెపు శ్రీనివాస్ (రాష్ట్ర ఆర్టీ అప్డేట్ ఛానల్ ఇన్ఛార్జ్), సంతోష్ (వరంగల్ జిల్లా కార్యదర్శి), శ్రీరామ్ మల్లే శం, చింత లావణ్య (19వ డివిజన్ అధ్యక్షు రాలు), చింత జోతి (19వ డివిజన్ ఉపాధ్య క్షురాలు), జిల్లా, రాష్ట్ర కమిటీ బాధ్యులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






