17 August, 2026 | 4:59 PM

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి

17-08-2026 03:54 PM

జన్నారం బీఆర్ఎస్ నాయకులు

జన్నారం, (విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించింది వేలాది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ బక్కయ్యకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, వాటికి స్వస్తి పలికే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ పథకాలను యథావిధిగా కొనసాగించి, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ మండల నాయకులు రాజా రామ్ రెడ్డి, జనార్ధన్, దేవన్న తదితరులు పాల్గొన్నారు.